కౌకుంట్ల లో ఘనంగా సీతారాముల కళ్యాణం
విశ్వంభర, కౌకుంట్ల: మహబూబ్ నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం శ్రీ శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో చెన్నకేశవ స్వామి భజన మండలి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తిరు కళ్యాణానికి ప్రతి ఒక్కరూ ఊరువాడా పిల్ల జల్ల అంతా కలిసి మేళ తాళాలు భజంత్రీలతో ఆకాశమంత పందిరి వేసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దలు, ప్రముఖులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి ఆనంద చికితులైనారు. ప్రతి ఒక్కరి కి స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుండి 8 గంటల వరకు మండల పురవీధులలో ఉత్సవ ఊరేగింపులు ఉంటాయని అందరూ స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఎల్లవేళల ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని భక్తజన మండల సభ్యులు తెలిపారు.



