వైభవంగా సీతారాముల కళ్యాణం 

వైభవంగా సీతారాముల కళ్యాణం 

 విశ్వంభర, ఉప్పుగూడ :  శ్రీ సీతా రామచంద్రస్వామి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర సాయి ధామం మల్లికార్జున నగర్ లలితా బాగ్ ఉప్పుగూడలో సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని ఈ కళ్యాణం లో మూగ, చెవిటి, గుడ్డి, వికలాంగులు, వృద్ధులు, దివ్యాంగులు అయినటువంటి వ్యక్తులను కళ్యాణానికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి వాళ్లకు భోజనాలు చేయించి స్వామి వారి ఆశీర్వచనాలతో చూపర్లను ఆకట్టుకున్నారు. వైవిద్యమైన నిర్ణయాలు తీసుకొని కొత్త పంథాలో సాగుతున్న ఈ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మిద్దెల చంద్రశేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ ముని గంటి సుశీల్ కుమార్ చారి, కోశాధికారి గుండు శ్రీకాంత్, బోనకుర్తి  మోహన్ కార్యదర్శి భక్తులు ప్రజలు కళ్యాణాన్ని తిలకించి అన్న ప్రసాదాలను తీసుకున్నారు.

Tags: