దాసరిగూడెంలో  సీతారామ కళ్యాణం 

దాసరిగూడెంలో  సీతారామ కళ్యాణం 

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో 6 వార్డు దాసాయి గూడెం లో శ్రీ సీతారాముల స్వామి కళ్యాణం ఉత్సవాన్ని కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వార్డు కౌన్సిలర్ చిలుముల సునీల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, అమ్మవార్ల కళ్యాణం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఇరువురు దంపతులు చిలుముల సైదిరెడ్డి వారి కుటుంబ సభ్యులు, కట్కూరి మహేష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, భూక్య కిషన్ వారి కుటుంబ సభ్యులు, కట్కూరి చంద్రారెడ్డి వారి కుటుంబ సభ్యులు, సీత రాముల వారి కళ్యాణం లో పాల్గొన్నారు, ఆలయ అర్చకులు సురేష్ కుమార్ శాస్త్రి, కట్కూరి గోపాల్ రెడ్డి, మంగళపల్లి వీరారెడ్డి, బంగారు శ్రీధర్, పర్వతం వెంకటేశ్వర్లు,గుంటొజు శంకరాచారి, విశ్వనాధుల రవీంద్ర చారి, కంచుకొమ్ముల కృష్ణ, ఉప్పల సతీష్ చారి, సురభి కోటేష్, ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పెద్దలు పాల్గొన్నారు.

Tags: