వరంగల్ పశ్చిమలో వైభవంగా సీతారాముల కల్యాణం

వరంగల్ పశ్చిమలో వైభవంగా సీతారాముల కల్యాణం

విశ్వంభర,  హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకల్లో నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పలు దేవాలయాలను సందర్శించి, సీతారాముల కల్యాణ మహోత్సవాలలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా అర్చకులు వేదమంత్రాల నడుమ శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దివ్యదర్శనం పొందారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, లోకకళ్యాణార్థం జరిగే సీతారాముల కల్యాణం ప్రతి ఇంటికి శుభశాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో ఉండాలని శ్రీ సీతారామచంద్రుల దివ్య ఆశీస్సులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: