షోటో ఖాన్ కరాటే పోటీల్లో ఆదర్శ విద్యార్థుల ప్రతిభ

షోటో ఖాన్ కరాటే పోటీల్లో ఆదర్శ విద్యార్థుల ప్రతిభ

విశ్వంభర, నల్గొండ: జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో తుంగపాడు ఆదర్శ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్. రంజిత తెలిపారు. మండల పరిధిలోని తుంగపాడు గ్రామంలో గల ఆదర్శ పాఠశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కరాటే పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులను ఆమె, పాఠశాల అధ్యాపక బంధం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్లగొండలో ఈనెల 23న జపాన్ కరాటే అసోసియేషన్ ఎస్ఎస్ కరాటే జిమ్నాస్టిక్ అకాడమీ నల్లగొండ ఆధ్వర్యంలో ఫోటో ఖాన్ తెలంగాణ స్టేట్ చాంపియన్షిప్ కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొనగా తమ పాఠశాల విద్యార్థులైన సిహెచ్,  జ్యోతిక, వర్షిని, ఎల్ అంజలి లు ప్రథమ స్థానంలో రాణించి బంగారు పతకాలు సాధించారు. అదేవిధంగా సాత్విక, భావన, అక్షయ, రితిక లు ద్వితీయ స్థానంలో రాణించి వెండి పథకాలు, సర్టిఫికెట్లు సాధించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ప్రతిభ కనబరచాలన్నారు. విద్యార్థినిలు కరాటే లో చక్కని ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇస్తున్న కరాటే మాస్టర్ బంటు రామారావును ప్రత్యేకంగా అభినందించారు. కరాటే మాస్టర్ బంటు రామారావు మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకు,  ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: