ప్రతి మహిళ ఓ ఆదిపరాశక్తి : డా. నైనా జైశ్వాల్
- పద్మశాలి భవన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
విశ్వంభర, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని నారాయణగూడ రాజ్ మొహల్లా లోని పద్మశాలి భవన్ లో అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం ప్రెసిడెంట్ వనం దుశ్యంతల అధ్యక్షతన జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేటర్ , ఇంటర్నేషనల్ టిటి ప్లేయర్ , యంగెస్ట్ పిహెచ్డి హోల్డర్ డా. నైనా జైశ్వాల్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో మహిళలందరూ అన్ని రంగాలలో ముందుకు సాగాలని మహిళల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు పాటుపడేలా కృషి చేయాలని ఆమె అన్నారు. ప్రతి ఆడపిల్ల , ప్రతి మహిళ ఓ ఆదిపరాశక్తి లాంటివారు అని అన్నారు. ప్రస్తుత సమాజంలో దేనినీ గుడ్డిగా నమ్మకుండా మహిళలంతా ఆత్మస్థైర్యం తో బలంగా నిలబడాలని అన్నారు. తల్లితండ్రుల ఆశలను వమ్ము చేయకుండా జీవితంలో అనుకున్నది సాధించాలని చెప్పారు. గివ్ టు గెయిన్ అనే ధీమాతో మహిళల రక్షణకై , సాధికారతతో మహిళా లోకం అంతా ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన మహిళ ప్రముఖుల ప్రసంగాలు , చిన్నారులు ఆటపాటలు , కూచిపూడి నాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రంగాలలో ప్రతిభ గల మహిళా నారీమణులకు సన్మాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.



