సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
On
విశ్వంభర, షాద్ నగర్ ; సోమవారం ఫరూఖ్ నగర్ మండలంలోని లింగారెడ్డి గూడా గ్రామంలో 18.0 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. సిఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన 10.0 లక్షలు,మరియు డి ఎం ఎఫ్ టి నిధులు ద్వారా మంజూరైన 8.0 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్లకు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల సుజాత లక్ష్మయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్ గౌడ్, నియోజకవర్గ లింగారెడ్డి గూడా అశోక్, మాజీ డిప్యూటీ సర్పంచ్ మల్లేష్ యాదవ్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.



