హన్వాడ విగ్రహావిష్కరణకు బయలుదేరిన షాద్ నగర్ ముదిరాజ్ నాయకులు అభిమానులు

WhatsApp Image 2024-07-17 at 17.30.04_2c3acc4f

విశ్వంభర న్యూస్ : - షాద్ నగర్ పేదల కోసం పోరాడిన యోధుడు పండుగ సాయన్న తెలంగాణ రాబిన్‌హుడ్‌ అని కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్ అన్నారు.మహబూబ్‌నగర్‌ పట్టణంలోని హన్వాడ పట్టణంలో బుధవారం నిర్వహించే పండుగ సాయన్న విగ్రహావిష్కరణ సందర్భంగా షాద్ నగర్ పట్టణానికి వచ్చి పండగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పండగ సాయన్న 133వ జయంతి సందర్భంగా ఆయన ప్రసంగించారు. వందేళ్లకు పైగా ఆ యన చరిత్రను ఉమ్మడి రాష్ట్రంలో తొక్కేశారని చెప్పారు. ఆ వీరుని ఖ్యాతిని మరింతగా పెంచే బాధ్యత మనపై ఉందన్నారు. ధనవంతులతో పోరాడి, పేదలకు సాయం చేసిన సాయన్నను స్మరించుకోవటం గర్వంగా ఉందన్నారు. ఉన్నోళ్లను కొట్టి లేనోళ్లకు పెట్టిన గొప్ప దీశాలి అప్పటి జమీందారీ భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ  యువతను ఏకం చేసి ఒక దళంగా తయారుచేసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమీందారీ భూస్వాముల ఇల్లను కొల్లగొడుతూ  ఆకలితో అలమటించే నిరుపేదల బ్రతుకుల్లో వెలుగులు నింపిన మహాదీరుడు వీరుడు పండగ సాయన్న అని అన్నారు.  ఇప్పటికి కడు పేదరికంలో మగ్గుతున్న  సాయన్న వారసులకు అన్ని విధాలుగా అండగా ఉండవలసిన అవసరం ఉందని. ఉమ్మడి జిల్లాలో పండుగ సాయన్న, నాగన్న, మియాసాబు వంటి మహావీరుల చరిత్రలు ఎన్నో ఉన్నాయన్నారు. పండుగ సాయన్న జీవిత చరిత్ర మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.నేడు హన్వాడ పట్టణంలో పండగ సాయన్న భారీ విగ్రహావిష్కరణకు షాద్నగర్ పట్టణం నుండి దాదాపు 500 మంది ముదిరాజ్ నాయకులు ముదిరాజ్ బంధువులు నీలం మధు ముదిరాజ్ తో కలిసి వెళ్లారు.

Read More మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి: సీఐటీయూ

🕒 17 Jul 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/shad-nagar-mudiraj-leaders-who-left-for-hanwada-idol-unveiling/article-2903

Related Posts