ఘనంగా ఎంఈఓ రూపారాణి పదవీ విరమణ వేడుక
విశ్వంభర, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల ఎంఈఓ, స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జంగ రూపారాణి పదవీ విరమణ వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం అమ్మ యాకయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు రూపారాణి దంపతులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు రూపారాణి క్రమశిక్షణ, సమయపాలనలో ఆదర్శంగా నిలిచారని, ఆమె నాయకత్వంలో పాఠశాల పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిందని కొనియాడారు. పదవీ విరమణ ఉద్యోగానికేనని, సేవకు కాదని పేర్కొన్నారు. రూపారాణి మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందని, సహకరించిన ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దశాబ్దాలకుపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఏర్పడిన అనుబంధాన్ని ఎప్పటికీ మరువలేనని భావోద్వేగంగా పేర్కొన్నారు.