తెలంగాణ ఉద్యమకారుల అరెస్టు

తెలంగాణ ఉద్యమకారుల అరెస్టు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో సోమవారం  మండలంలోని తెలంగాణ ఉదయమకారులను  అసెంబ్లీ ముట్టడికి వెళ్ళకుండా రామన్నపేట మండల పోలీసులు ఉదయం వారి ఇండ్ల వద్దకు వెళ్లి అరెస్టు చేసి రామన్నపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఉద్యమకారుల ఫోరం రామన్నపేట మండలాధ్యక్షులు నోముల శంకర్, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్ లు మాట్లాడుతూ, ఇలాంటి అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, తెలంగాణ ఉద్యమకారుల ప్రధానమైన డిమాండ్ల పై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి నిజమైన ఉద్యమకారుల గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలం 25 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమకారులకు 10 లక్షల రూపాయల మెడికల్ సౌకర్యం కల్పించాలని, ఉద్యమకారుల ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పదివేల కోట్ల రూపాయలతో ఉద్యమకారుల ఆదుకోవాలని, ఉద్యమకారులపై ఉన్న కేసులను అన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం మండల ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, బోగారం మాజీ ఉప-సర్పంచ్, ఉద్యమ నాయకులు ఎండి ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: