కండక్టర్ కూతురుకు సజ్జనార్ అభినందనలు

కండక్టర్ కూతురుకు సజ్జనార్ అభినందనలు

  • మెడిసిన్ కోర్సు ప్రవేశ పరీక్షలో విద్యార్థిని ప్రతిభ
  • షాద్‌నగర్ డిపో కండక్టర్ కూతురుకు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు 
  • ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు 

డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఏఐఐఎంఎస్)  నిర్వహించిన ప్రవేశ పరీక్షలో కండక్టర్‌ కూతురు మెరిసింది. షాద్‌నగర్‌ డిపోనకు చెందిన కండక్టర్‌ పి.మహాలింగం కూతురు మౌనిక ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. 

ఈ సందర్భంగా టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా గురువారం ఉదయం అభినందనలు తెలిపారు. ‘‘పట్టుదల, ఏకాగ్రతతో చదివి జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మౌనికకు అభినందనలు.. భవిష్యత్‌లో ఆమె ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ పేర్కొన్నారు.

Read More మీడియానే టార్గెట్? నేతల స్కాంలపై సిట్ ఎక్కడ?: కేటీఆర్

Related Posts