కావాలనే పవర్ కట్ చేయిస్తున్నారు.. బీఆర్ఎస్ నేతపై రేవంత్ రెడ్డి ఫైర్! 

కావాలనే పవర్ కట్ చేయిస్తున్నారు.. బీఆర్ఎస్ నేతపై రేవంత్ రెడ్డి ఫైర్! 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైతులకు కరెంటు కష్టాలు మొదలయ్యాయి అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా కరెంట్ కోతలు రావడం గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన ఇంట్లో మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 

 

Read More జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

ఈ సందర్భంగా తెలంగాణలో ఏర్పడినటువంటి పవర్ కట్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఉద్దేశపూర్వకంగానే కొందరు కావాలనే పవర్ కట్ చేయిస్తున్నారని తెలిపారు. హరీష్ రావు వంటి వారు కొంతమంది అధికారులతో ఇలాంటి తల తిక్క పనులు చేయిస్తున్నారని ఈయన మండిపడ్డారు.

 

Read More జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

విద్యుత్ శాఖలో పనిచేసే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో హరీష్ రావు ఇలాంటి పనులు చేయిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ వేవ్ ఏమీ లేదని తెలిపారు. తాము 9 నుంచి 13 లోక్ సభ స్థానాలు గెలుస్తామని, ఆరేడు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావని రేవంత్ రెడ్డి వెల్లడించారు.