89 మద్యం బాటిళ్లధ పట్టివేత
On
విశ్వంభర, జిహెచ్ఎంసి : నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ గోవా, ఢిల్లీ ప్రాంతాల నుంచి వస్తుందనే సమచారం మేరకు ఎస్టీఎఫ్ బీ అండ్ డీ టీమ్ సీఐలు బిక్షారెడ్డి, నాగరాజు సిబ్బంది కలిసి మంగళవారం తెల్లవారు జామున పహాడ్ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 89 ఢిల్లీ, గోవా ప్రాంతాలకు చెందిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం బాటిళ్ల విలువ రూ. 1.70 లక్షలుగా ఉంటుందని అంచనా. పట్టుకున్న మద్యం బాటిళ్లను మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించామని సీఐలు తెలిపారు.



