గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
On
విశ్వంభర, హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో తూకారంగేట్, నార్త్ లాలాగూడ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న విక్రయిస్తున్న ఇద్దరిని ఎస్టీఎఫ్ సీ టీమ్ అరెస్టు చేశారు. నిందితుల నుంచి 515 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఐ మంజు తెలిపారు. ఈ కేసులో కాంబ్లె మంజుల, రాకేష్ మండల్‌ను అరెస్టు చేసి గంజాయితోపాటు కొత్త ఎక్సైజ్ స్టేషన్ మారేడ్‌పల్లిలో అప్పగించినట్లు చెప్పారు .



