అధికారులతో ఎమ్మెల్యే సమావేశం 

అధికారులతో ఎమ్మెల్యే సమావేశం 

విశ్వంభర, రాప్తాడు: రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పంచాయతీ ఏపీవో, ఉపాధి హామీ, మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిసి రోడ్లు, డ్రైనేజీ , ఉపాధి హామీ పనులు పూర్తి చేస్తే కొత్త నిధులు తీసుకొచ్చి మరిన్ని అభివృద్ధి పనులు చేయవచ్చు అని చెప్పారు.  ఏమైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Tags: