వఖ్ఫ్ ఆస్తుల రక్షణ కల్పించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. -అఖిలపక్ష ముస్లిం నాయకుల డిమాండ్.
On
విశ్వంభర, మహబూబ్ నగర్ :- పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలోని మహిబూబియా అఖిలపక్ష ముస్లిం నాయకుల సమావేశం టిఎఫ్ టి యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముస్లిం రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఉలేమాలు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త హనీఫ్ అహ్మద్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల రక్షణ కొరకు ముస్లిం సమాజం మొత్తం ఐక్యమవ్వాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ సబ్బండ వర్గాల సహకారాన్ని తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే మైనార్టీ సమస్యల పరిష్కారం కొరకు ఒక ప్రతినిధి బృందంగా ఏర్పడి రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించాలని కోరారు.ప్రముఖ రాజకీయవేత్త అన్వర్ పాషా మాట్లాడుతూ వఖ్ఫ్ ఆస్తుల రక్షణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తొమ్మిది లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు కలిగి ఉందని నివేదిక ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. ఆ భూములన్నీ కూడా వక్ఫ్ ఉమ్మిద్ పోర్టల్లో చేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. గడువులు విధించడం సరికాదన్నారు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం చేయడం కొరకే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. ఎంఐఎం అధ్యక్షులు ఎంఏ హాది మాట్లాడుతూ మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉర్దూగర్, షాది ఖానా , హజ్ హౌస్ నిర్మాణం కొరకు జాప్యం జరుగుతుందని వాపోయారు. స్థానిక శాసనసభ్యులను సంప్రదించి తక్షణం సమస్యల పరిష్కారం కొరకు డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం కన్వీనర్ జి. గట్టన్న మాట్లాడుతూ పీర్ల మసీదులు, పీర్ల మాన్యాలు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వాటిని రక్షించడం కొరకు వక్ఫ్ బోర్డ్ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు గానీ పూనుకోకపోవడము దుర్మార్గమన్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షతను పాటిస్తున్నాయని విమర్శించారు.సీనియర్ నాయకులు ఖాజా నిజాముద్దీన్ వందన సమర్పణ చేశారు.ఈ కార్యక్రమంలో అల్మేవ రాష్ట్ర అధ్యక్షులు ఫారుఖ్ హుస్సేన్, జామే మస్జిద్ కార్యదర్శి ఎంఏ మజీద్, ప్రముఖ పాత్రికేయులు రఫీక్ పటేల్ , జాకీర్ అడ్వకేట్, మౌలానా నాసర్, మౌలానా ఇస్మాయిల్, అహమ్మద్ సనా, టిఆర్ఎస్ నాయకులు ఇమ్రాన్, తఖి హుస్సేన్, సాదిక్ భూత్పూర్, ముజీబ్, బాబార్ షేక్ , రెహమాన్ రిటైర్డ్ హెడ్మాస్టర్, ఏ వన్ సిరాజ్, మహమ్మద్ రియాజ్ మహమ్మద్ హస్మాద్దీన్ రిటైర్డ్ ఉపాధ్యాయులు, సమద్ ఖాన్, నూరుల్ హసన్ , సలీం ఇమాన్ కమిటీ, జహంగీర్, టిఆర్ఎస్ నాయకులు ఇక్బాల్ , వాహద్ తాజ్ , జబ్బర్ ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.



