సీనియర్ నాయకులను కాంగ్రెస్ పట్టించుకోవాలి: కుంచెపు రమ
విశ్వంభర, నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని బండారి లేఔట్ కాలనీ అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్ నాయకత్వం స్థానిక కార్యకర్తలకు అన్యాయం చేస్తోందని అఖిలభారత వడ్డెర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కుంచెపు రమ ఆరోపించారు. కాలనీ అధ్యక్షుడిగా కుమార్ యాదవ్‌ను నియమిస్తామని గత రెండు నెలలుగా హామీ ఇచ్చి, ఆధార్ వివరాలు సైతం తీసుకున్నప్పటికీ ఇప్పటికీ నియామకం చేపట్టలేదని ఆమె విమర్శించారు. బండారి లేఔట్‌కు చెందిన కార్యకర్తను పక్కనపెట్టి, మరో ప్రాంతానికి చెందిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీనియర్ నేతలు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం, పదవులు కల్పించాలని కుంచెపు రమ డిమాండ్ చేశారు.