ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధించనున్న డిగ్రీ విద్యార్థులు
విశ్వంభర, మహబూబాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న "అన్నా-అక్క మెంటర్‌షిప్ ప్రోగ్రామ్–ఏఐ, డిజిటల్ లెర్నింగ్"లో భాగంగా మహబూబాబాద్ నూకల రామచంద్రరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) విద్యార్థులు శిక్షణ పూర్తి చేసి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై "సర్టిఫైడ్ స్టూడెంట్ ట్రైనర్స్"గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. లక్ష్మణ్ నాయక్ వారికి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ సంయుక్తంగా నిర్వహించిన శిక్షణలో కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ లెర్నింగ్, ఆధునిక సాంకేతికతలపై విద్యార్థులకు శిక్షణ అందించారు. అర్హత సాధించిన విద్యార్థులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ, డిజిటల్ లిటరసీ, కంప్యూటేషనల్ థింకింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం గ్రామీణ విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదపడుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, నోడల్ అధికారులు ఎం. సుమన్, వి. సాంబశివరావు, ఎస్.కే. కాసింషా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ జూపూడి అనిల్ కుమార్ పాల్గొన్నారు.