పదవులు శాశ్వతం కాదు సేవాగుణమే శాశ్వతం - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .
- చౌటుప్పల్ మున్సిపల్ సిబ్బందికి వైద్య శిబిరం.- చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 123 వ ఉచిత వైద్య సేవలు
On
విశ్వంభర, యాదాద్రి భువనగిరి జిల్లా; చౌటుప్పల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఆర్కే హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో పల్లె పల్లె కి వైద్యం కార్యక్రమంలో భాగంగా చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 123 వ ఉచిత వైద్య శిబిరాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందరబంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు (మున్సిపల్ సిబ్బందికి) వైద్య శిబిరం నిర్వహించడం మంచి పరిణామని అన్నారు. చావా ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ ఆశిస్తున్నాని అన్నారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కాదు, ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ తోటి సామాజిక కార్యక్రమాలు చేయాలి. మా తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. చావా ఫౌండేషన్ కి మా ఫౌండేషన్ తరపున మా ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. నేను శాసనసభ్యుడుగా కాకుండా ఒక స్నేహితుడు లాగా, వ్యక్తిగా సహాయం చేస్తా అని, పదవి అనేది శాశ్వతం కాదు, కానీ మన వ్యక్తిత్వం సేవ చేయాలని గుణం ఉండడం శాశ్వతం. సేవ చేయాలనే గుణం పుట్టిన నాటి నుండి మరణించే వరకు ఉంటుంది.. కానీ పదవి ఉండదని గుర్తు చేశారు.
🕒 30 Aug 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/positions-are-not-permanent-sevaguna-is-permanent-mla-komatireddy/article-6230