కల్యాణ లక్ష్మి పధకంలో మేనమామ కానుక గా పోచంపల్లి పట్టు చీరను అందించాలి.  - సీఎం రేవంత్ రెడ్డి కి బొల్ల శివశంకర్ లేఖ 

కల్యాణ లక్ష్మి పధకంలో మేనమామ కానుక గా పోచంపల్లి పట్టు చీరను అందించాలి.  - సీఎం రేవంత్ రెడ్డి కి బొల్ల శివశంకర్ లేఖ 

విశ్వంభర, హైదరాబాద్ :-  కల్యాణ లక్ష్మి పథకంలో పోచంపల్లి పట్టు చీరలను "మేనమామ కానుక"గా చేర్చి, చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ  ఆదాయం వచ్చేలా మార్గాలను కల్పించాలని అఖిల భారత పద్మశాలి రాజకీయ విభాగం,  నేతన్న యాత్ర అధ్యక్షులు బొల్ల శివ శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు. మన భారతీయ సంస్కృతి మరియు స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత కార్మికుల పాత్ర అమూల్యమైనది. ఆనాటి రాజులు, దేవతలు, మానవుల మానాలను కాపాడిన చేనేత కార్మికులు, మన సాంప్రదాయ వస్త్రాలను చేతితో తీర్చి, మన వారసత్వాన్ని రక్షించారు. మహాత్మా గాంధీ చెరకా మరియు చేనేత బట్టలతో (ఖాదీ) స్వదేశీ ఉద్యమాన్ని నడిపించి, భారత స్వాతంత్య్ర సమయంలో  ఊపిరి పోశారు. కానీ, నేడు చేనేత కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆధునిక మార్కెట్ పోటీ, ఆర్థిక సమస్యలు, మరియు తగ్గిన డిమాండ్ వల్ల వారు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ముడ్డి సరుకు ధరలు పెంరాగడం మరియు జిఎస్టీ భారంతో మార్కెట్లో సరైన అమ్మకాలు లేకపోవడం వల్ల ఆత్మహత్యలకు పలు పడుతున్నారు తెలంగాణలో పోచంపల్లి, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. మీ ప్రభుత్వం 2025లో చేనేత కార్మికులకు ₹33 కోట్ల రుణ మాఫీ, నేతన్నకు చేయూత పథకం (₹290 కోట్లు, 36,133 మంది లబ్దిదారులు) వంటి అద్భుత కార్యక్రమాలు చేపట్టినందుకు అభినందనలు. ఈ నేపథ్యంలో, మీరు చేపట్టిన "కల్యాణ లక్ష్మి" పథకం (SC/ST/మైనారిటీ కుటుంబాలకు *1,00,116 ఆర్థిక సహాయం) లో ఒక చిన్న మార్పును సూచిస్తున్నాము. ప్రతి అర్హ కుటుంబానికి, ఈ ఆర్థిక సహాయంతో పాటు పోచంపల్లి పట్టు చీరలు (చేనేత సిల్క్ ) ను "మేనమామ కానుక" పేరుతో కానుకగా అందించాలని మనవి. ఈ చీరల ధరను పథకం ఆర్ధిక సహాయంలో భాగంగా కలుపుకోవచ్చు, మరియు ఇది కావలసినవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఈ సూచనతో చేనేత కార్మికులకు నిరంతర ఆదాయం, ఉపాధి కల్పించబడుతుంది.,  స్వదేశీ ఆత్మను పెంపొందిస్తూ, స్థానిక హ్యాండ్లూమ్ పరిశ్రమ బలోపేతం అవుతుంది.,  వివాహ సందర్భాల్లో సాంప్రదాయ వస్త్రాలు ధరించడం ద్వారా యువతకు సంస్కృతి అందుతుందని లేఖ ద్వారా సీఎంకు తెలిపారు.WhatsApp Image 2025-09-13 at 2.59.22 PMWhatsApp Image 2025-09-13 at 2.59.34 PMWhatsApp Image 2025-09-13 at 2.59.24 PM

Tags: