వస్తాకొండూర్ లో ఘనంగా  బడిబాట 

వస్తాకొండూర్ లో ఘనంగా  బడిబాట 

విశ్వంభర, గుండాల: గుండాల మండలం లోని వస్తాకొండూర్ గ్రామంలో  బడిబాట కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జూలకంటి నర్సిరెడ్డి మాట్లాడుతూ,  గతంలో ఈ గ్రామంలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలు వైపు వెళ్లడం వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది కానీ ఇప్పుడు పాఠశాల లో ఉపాధ్యాయులు అందుబాటులో వచ్చారని, విద్యార్థులు వ్యయ ప్రయాసలు పడి దూర ప్రాంతాల పాఠశాలలకు వెళ్లి  ఇబ్బందులు పడకుండా మన గ్రామం లో ఉన్న ఉన్నత పాఠశాల కు రావాలని కోరారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంపాల రాజు  మాట్లాడుతూ,  ప్రస్తుతం ప్రభుత్వం కూడ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను కొన్ని చోట్ల ప్రారంభించారు అదే విధంగా అన్ని పాఠశాలల్లో కూడా మొదలు చేసి 3 సంవత్సరాల కే విద్యార్థులను బడిలో చేర్చుకునే లా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారన్నారు. ఆ దిశగా మన ఊరు లో కూడా ప్రీ- ప్రైమరీ ఎడ్యుకేషన్ విధానం అమలులోకి చేసుకొని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే లా వారి తల్లిదండ్రులను ప్రోత్సహించడం కోసం గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని కోరారు. గ్రామ సర్పంచ్ లింగాల అనిల్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ, ఈ వస్తాకొండూర్ గ్రామ పాఠశాల కు ఘనమైన చరిత్ర ఉందని చుట్టుపక్కల ఎన్నో గ్రామాల నుండి వందల మంది విద్యార్థులు వచ్చేవారని ఇప్పుడు పాఠశాల కనుమరుగు కాకుండా గ్రామ సర్పంచ్ గా తన వంతు కృషి చేసి మరల ఈ పాఠశాల కు గత వైభవం తీసుకు రావడానికి గ్రామ ప్రజా ప్రతినిధులు, అందరం కలిసి విద్యార్థులు తల్లిదండ్రులను ఒప్పించి మన బడి కి పంపడం కోసం ఈ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరుశురాములు, ఏఏపిసీ మాజీ చైర్మన్, లింగాల బిక్షం గౌడ్, గతం లో విద్యా వాలెంటెరుగా పనిచేసిన వీరమల్ల సోమన్న,  పాఠశాల ఉపాధ్యాయులు, దార్ శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు పద్మ, రమ, రాజమణి,  సునీత , ఆశాకార్యకర్త రజిత ,  రాజు , ఎస్. రాజు , గనగాని వెంకన్న, సోమనారి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags: