రోడ్డు సేఫ్టీ పై ప్లెక్సీల ఏర్పాట్లు
On
విశ్వంభర, నెల్లికుదురు: మండల కేంద్రం నెల్లికుదురుతో పాటు బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాలలో ఎస్సై చిర్ర రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. అనంతరం అరైవ్ అలైవ్ లో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్స్ ధరించాలన్నారు. లైసెన్సులు కలిగి ఉండాలని సూచించారు. మైనర్లకు బైకు ఇవ్వద్దన్నారు. కార్లలో వెళ్లేవారు సీటు బెల్టులు ధరించాలని చెప్పారు. వేగం కన్నా ప్రాణాలు ముఖ్యమని నిత్యం గుర్తు చేసుకోవాలని కోరారు. అనంతరం రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞలు చేయించారు. రోడ్లకు ఇరువైపులా నెమ్మదిగా వెళ్లండని, ప్రమాదకరమైన ప్లేస్లను గుర్తు చేస్తూ పోలీసుల ఆధ్వర్యంలో భద్రతా నియమాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.



