జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు బదిలీ 

జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు బదిలీ 

తెలంగాణలోని సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇంత వరకూ ఈ కేసును బంజారాహిల్స్‌ పోలీసులు విచారించారు. ఇప్పుడే కేసును జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు మార్చారు. బంజారాహిల్స్‌ పోలీసులు ఈ కేసులో నిందితుడు రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. కానీ.. మరి కేసును ఎందుకు వేరే స్టేషన్‌కు మార్చాల్సి వచ్చిందో అనేదానిపై దర్యాప్తు అధికారులు స్పష్టత ఇవ్వలేదు.

 

Read More యువ విద్యార్థుల్లో వ్యవస్థాపక ప్రోత్సాహమే బీవీఆర్ సైంట్ లక్ష్యం:బీవీఆర్ సైంట్ సీఈవో డా. సుధాకర్ పొటుకుచ్చి 

మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. 

దర్యాప్తు అధికారులు ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలో మరిన్ని అరెస్టులు జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న పోలీసులను దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే, ఇప్పుడు మరికొంత మంది పోలీసులతో పాటు ప్రైవేట్‌ వ్యక్తులను కూడా అరెస్ట్‌ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. 

 

Read More యువ విద్యార్థుల్లో వ్యవస్థాపక ప్రోత్సాహమే బీవీఆర్ సైంట్ లక్ష్యం:బీవీఆర్ సైంట్ సీఈవో డా. సుధాకర్ పొటుకుచ్చి 

ఫోన్ ట్యాపింగ్, స్పెషల్ ఇంటెలిజెన్స్ లాకర్ రూమ్ ధ్వంసం చేసిన కేసులో ప్రభాకర్ రావు భారత్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. నిజానికి ఆయన జూన్ 26న ఇండియాకు రావడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఓ వైపు రెడ్ కార్నర్ నోటీసులు, మరోవైపు కేసు తీవ్రత పెంచడంతో ఈ నెల ఆఖరునే వచ్చేందుకు ప్రభాకర్ రావు ఏర్పాట్లు చేసుున్నారని సమాచారం.

 

Read More యువ విద్యార్థుల్లో వ్యవస్థాపక ప్రోత్సాహమే బీవీఆర్ సైంట్ లక్ష్యం:బీవీఆర్ సైంట్ సీఈవో డా. సుధాకర్ పొటుకుచ్చి 

రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ఇమ్మిగ్రేషన్, ఇంటర్‌పోల్‌కు అందింది. దీంతో.. ప్రభాకర్ రావు ఇండియా వస్తే ఆయన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే వారిని అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఈకేసు బంజారాహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు మార్చడం సంచలనంగా మారింది.