పోస్టర్ ఆవిష్కరణ

పోస్టర్ ఆవిష్కరణ

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ఆగస్టు 26న రవీంద్ర భారతిలోహైస్కూల్ విద్యార్థులకు నిర్వహించే వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం, పాటల పోటీల  కల్చరల్ ఫెస్టివల్ పోటీల పోస్టర్‌ను శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పర్యావరణవేత్త డాక్టర్ జయసూర్య ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, దేశభక్తి, సామాజిక స్పృహ పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త రాజశేఖర్ నిమ్మల, హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి వీరయ్య, ఉపాధ్యక్షులు పాండవుల నాగేశ్వరరావు, పి. శ్రీనివాసరావు, మోహన్ నాయుడు, నాయకులు సంగీత, అస్మిత, సుకుమార్, శంకరయ్య, రమేష్ పాల్గొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/poster-invention/article-18891

Tags: