పుప్పాలగూడ AVOPA యూనిట్ అధ్యక్షులు దారం వేణుమాధవ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్‌ల పంపిణి

పుప్పాలగూడ  AVOPA  యూనిట్ అధ్యక్షులు దారం వేణుమాధవ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్‌ల పంపిణి

విశ్వంభర,హైదరాబాద్ : అవోపా పుప్పాలగూడ యూనిట్ అధ్యక్షులు దారం వేణుమాధవ్ ఆధ్వర్యంలో మణికొండ ప్ప్రైమరీ స్కూల్ , ఎంప్లాయీస్ కాలనీ లో  స్కూల్ బ్యాగ్‌ల పంపిణి  కార్యక్రమానికి ముఖ్య  అతిథి  తెలంగాణ రాష్ట్ర AVOPA అధ్యక్షుడు మలి పెద్ది శంకర్ పాల్గొన్నారు.  ఈ  సందర్భముగా  ప్రాథమిక పాఠశాలలో 1 వ తరగతి నుండి 5వ తరగతి వరకు అన్ని తరగతుల పిల్లలకు  స్కూల్ బ్యాగులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో చేరి మద్దతు ఇచ్చిన సభ్యులందరికి  అవోపా పుప్పాలగూడ యూనిట్ దారం వేణు మాధవ్ అధ్యక్షుడు అభినందించారు . ఈ సందర్భముగా మాట్లాడుతూ  రాష్ట్ర అధ్యక్షులు మల్లిపెద్ది శంకర్ అన్న  పిల్లలకు కొన్ని  మంచి విషయాలను వివరించడం జరిగిందన్నారు ,  తల్లిదండ్రులు గురువులు ధైవంతో సమానం అనే విషయం ,  పిల్లల్లో మొబైల్ వాడకం తగ్గించాలని విషయం,  ఉదయం తొందరగా లేవడం  ప్రార్థన చేయడం,   అందర్నీ ప్రేమతో  మాట్లాడాలని నేర్పడం  మరియు చిన్నతనంలోనే పిల్లలకు తన లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని నేర్పడం జరిగిందన్నారు .ఈ  కార్యక్రమం లో కంచము నాగరాజు , అవోపా రాష్ట్ర కార్యదర్శి,బొడ్డు శ్రీధర్  అధ్యక్షులు, రంగారెడ్డి తూర్పు యూనిట్1, గజ్జల స్రవంతి , రంగారెడ్డి జిల్లా తూర్పు మహిళా విభాగం అధ్యక్షులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు .

Tags: