శివ స్వాముల ఇరుముడి సందర్భంగా అన్నదానం
On
విశ్వంభర, వెల్దండ: వెల్దండ మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో శివ స్వాముల ఇరుముడి సందర్భంగా మండల గౌడ సంఘం అధ్యక్షులు మాజీ సింగల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా భూదర్ పేటస్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివ స్వాములకు, భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో గురు స్వాములు, శివ స్వాములు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



