రావిచేడ్ లో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం

రావిచేడ్ లో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం

విశ్వంభర, కడ్తాల్: ప్రజాస్వామ్యానికి గ్రామపంచాయతీ పునాది లాంటిదని, ఆ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ అన్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో సర్పంచ్ బొప్పిడి గోపాల్ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ,  గ్రామీణ ప్రాంతాల పాలనకు స్థానిక సంస్థలు ఎన్నికలను పంచాయతీ రాజ్ వ్యవస్థగా పేర్కొనడం జరిగిందన్నారు. గ్రామీణ స్వయం పాలనకు పునాది పల్లెలను శక్తివంతం చేయడంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అన్నారు. గ్రామంలో పచ్చదనం ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. వీధులన్నీ పరిశుభ్రంగా ఉంటే గ్రామం మరింత అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. పంచాయతీరాజ్ ద్వారా వస్తున్న నిధులను గ్రామాభివృద్ధికి సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ముందుకు రావాలన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తున్నామని. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత. మురికి కాల్వల నిర్మాణం, సిసి రోడ్లు, రోడ్ల విస్తరణ, విదీపాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మండలంలో రావిచేడ్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బందరి యాదయ్య, వార్డు సభ్యులు హనుమంతు నాయక్, రామస్వామి, మంజుల, శోభ, గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి, మిషన్ భగీరథ హెల్పర్ సురేష్, తదితరులున్నారు.

Tags: