అధికారులకు నియోజకవర్గ సాధన సమితి సన్మానం
విశ్వంభర, రామన్నపేట: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని రామన్నపేట నియోజకవర్గంగ సాధన సమితి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారికి ఈ ప్రాంతం యొక్క చరిత్రను వివరిస్తూ అధికారులుగా వారి సహకారం ఉండాలని కోరడం జరిగింది. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత నియోజకవర్గమైన రామన్నపేటను పరిగణలోకి తీసుకోవాలని, నియోజకవర్గానికి కావలసిన అన్ని రకాల ఆఫీసులు ఉన్నాయని, నియోజకవర్గ ఏర్పాటుకు మండలంలో ఉన్న అన్ని రకాల అధికారుల సహకారం కూడా అవసరం తప్పకుండా ఉంటుందని, ప్రభుత్వానికి నివేదిక ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇవ్వవలసి ఉంటుందని, వారి సహకారం తప్పకుండా ఉండాలని ఒకప్పుడు రామన్నపేట నియోజకవర్గంలో ఎంతోమంది గొప్ప నాయకులు, అధికారులు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని, ఈ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు, ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలను ఈ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాలను నియోజకవర్గఒ ఏర్పడితే అభివృద్ధికి కావలసిన వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటుకు అధికారుల అవసరం తప్పకుండా ఉండాలని నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో రామన్నపేట సీఐ ఎన్.వెంకటేశ్వర్లుకు, రామన్నపేట ఎస్సై డి.నాగరాజుకు రామన్నపేట చరిత్రను వివరిస్తూ వారి యొక్క సహకారం ఉండాలని వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎర్ర రమేష్ గౌడ్, ఎస్కే చాంద్, నియోజకవర్గ సాధన సమితి నాయకులు వర్తక వ్యాపార సంఘం నాయకులు పోతరాజు శంకరయ్య, పిఆర్పిఎస్ నియోజకవర్గ అధ్యక్షులు వరికల్ గోపాల్, టిడిపి మండల అధ్యక్షులు ఎండి ఫజల్, తెలంగాణ ఉద్యమ నాయకులు రామన్నపేట మాజీ ఉపసర్పంచ్ గంగాపురం యాదయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత తెలంగాణ ఉద్యమకారులు గడ్డం యాదగిరి, తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ నకిరేకంటి అశోక్, బిజెపి మండల నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు ఏలూరు రవి, బీఎస్పీ మండల అధ్యక్షులు నకిరేకంటి నరేష్, సాధన సమితి నాయకులు పెండెం రవీందర్, బర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.



