ఎన్టీఆర్ అభిమానులపై లాఠీచార్జ్ - బహిరంగ క్షమాపణ చెప్పే ఉద్దేశం లేదు కాబట్టే..
On
విశ్వంభర, అనంతపురం : అనంతపురం అర్బన్ స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచి వందలాదిగా తరలివచ్చి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ నీ అతని తల్లిని దుర్భాషలాడినందుకు ప్రజలందరి ముందర అభిమానుల ముందర బహిరంగ క్షమాపణ కోరాలంటూ లేని పక్షంలో చలో అనంతపురం అనే కార్యక్రమంతో వందలాదిగా ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చి రోజు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా ఈ ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పే ఉద్దేశమే ఉంటే ఎప్పుడో చెప్పిండేవాడని ఆ ఉద్దేశం లేదు కాబట్టి ముందుగానే ఇంటిదగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఊర్లో లేకుండా అక్కడ ఇక్కడ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు అన్నారు. ఆడియో ఒరిజినల్ అంటూ ఒప్పుకున్న ధనుంజయ నాయుడు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా మీడియాకు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఆడియో ఒరిజినల్ అని తెలిసినా కూడా ఎంతవరకు క్షమాపణ చెప్పకపోవడంతో దీనిపై రాజకీయ కుట్ర ఏమన్నా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు క్షమాపణ చెప్పాలని ధర్నా చేయడానికి వచ్చిన మాపై పోలీసులను ముందుగానే ఏర్పాటు చేసుకొని లాటి చార్ట్ చేపించడం చాలా బాధాకరమన్నారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటివి జరగలేదని అందులో టిడిపి ప్రభుత్వంలోనే అది టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మనవడుకే ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందన్నారు.తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారిని దూషించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని తెలుగుదేశం పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఈ సందర్భంగా వారు కోరడం జరిగింది.



