తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులెన్నో నితిన్ నబీన్ చెప్పాలి
- టీపీసీసీ ఉపాధ్యక్షులు సంఘీశెట్టి జగదీశ్వరరావు
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయిస్తుందో, అదే సమయంలో రాష్ట్రం నుంచి జీఎస్టీ రూపంలో కేంద్రానికి ఎంత ఆదాయం వెళ్తుందో తెలుసుకున్న తర్వాతే బీజేపీ నేత నితిన్ నబీన్ రాష్ట్రంలో పర్యటిస్తే బాగుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, 'ముఖాముఖి' ప్రోగ్రామ్ ఇంచార్జ్ సంఘీశెట్టి జగదీశ్వరరావు విమర్శించారు. కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు విదేశాల నుంచి నల్లధనం తెస్తామని, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండి ఆ హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదో ముందు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని పదేపదే ఆరోపించిన బీజేపీ నేతలు.. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా దానపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసినప్పటికీ, ఇప్పటివరకు కేంద్రం ఎందుకు స్పందించడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల తరహాలో ఏవేవో అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి తెలంగాణలో గెలవాలని చూస్తే కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణ పౌరుషాల గడ్డ అని, ఉద్యమాల గడ్డ అని.. ఇక్కడ బీజేపీ ఆటలు ఏమాత్రం సాగవని ఆయన హెచ్చరించారు.