ఈ కబ్జాని అడ్డుకునేవారు లేరా...

ఈ కబ్జాని అడ్డుకునేవారు లేరా...

విశ్వంభర, హనుమకొండ:  గ్రేటర్ వరంగల్ ఏనుమాముల పరిధి ఎన్ టి ఆర్  నగర్ సర్వే  నెంబర్ 170/బి2 లోని 1.20గు. గల భూమిలో సుమారు ఇరవై సంవత్సరాలుగా నాతి శరత్ అను వ్యక్తి  కబ్జాలో  ఉంటున్నారు. ఇప్పుడు దూడెం రాజేష్ అనే వ్యక్తి , మరికొందరు నఖిలీ డాక్యుమెంట్ లు సృష్టించి తన భూమిని  ఆక్రమించుకుని అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని నాతి శరత్ మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో ఎంతో మంది ఈ భూమిపై అక్రమ కబ్జా కు ప్రయత్నించి కోర్టులో విఫలమైనారని ఇప్పుడు రాజేష్ అను వ్యక్తి  ఏకంగా నిర్మాణం చేపడుతున్నారని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా   సంబంధిత శాఖ అధికారులు  పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని నాతి శరత్  వాపోతున్నారు. ఎన్ టి ఆర్ నగర్ స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకుని నాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు తన గోడు విన్నవించుకున్నట్లు శరత్ తెలిపారు.  ఇప్పటికైనా రెవెన్యూ,  మున్సిపల్ కార్పొరేషన్,  టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి వెంటనె ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుకుంటున్నట్లు శరత్ తెలిపారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/there-is-no-one-to-prevent-this-possession/article-17488

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.