చింతలతానలో సీసీ రోడ్డుకు భూమి పూజ

చింతలతానలో సీసీ రోడ్డుకు భూమి పూజ

విశ్వంభర, తంగళ్ళపల్లి:  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చింతలతాన గ్రామానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సీసీ రోడ్డు పనులకు కు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం అనసూయ మహేందర్, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు ,జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు శ్రీధర్ రావుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: