నద్దునూరి సమ్మయ్య సేవలు మరువలేనివి

నద్దునూరి సమ్మయ్య సేవలు మరువలేనివి

  •  సిపిఐ ఆధ్వర్యంలో సమ్మయ్య 20వ వర్ధంతి సభ

విశ్వంభర, కేసముద్రం : ప్రజా ఉద్యమాల్లో, సిపిఐ లో అమరజీవి కామ్రేడ్ నద్దునూరి సమ్మయ్య సేవలు మరువలేనివని సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్ అన్నారు. గురువారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురంలోని స్థానిక కమ్యూనిటీ హాల్ లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ విద్యాకమిటీ ఛైర్మన్ అమరజీవి కామ్రేడ్ నద్దునూరి సమ్మయ్య 20వ వర్థంతి సందర్భంగా సమ్మయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంద భాస్కర్ అధ్యక్షతన జరిగిన వర్థంతి సభలో చొప్పరి శేఖర్, ఎన్ ఎ స్టాలిన్, వెల్పుగొండ ఆనంద్, జన్ను కట్టయ్య, దండు కొమురయ్య, వెల్పుగోండ ఏలీయా పలువురు వ్యక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్ మాట్లాడుతూ సమ్మయ్య మరణానికి ముందు కేసముద్రం మండలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ ఈ ప్రాంతంలో భూస్వామ్య వ్యతిరేక విధానాలపై పోరాడిన గొప్ప వ్యక్తి సమ్మయ్య గారు అన్నారు. భూ పోరాటాలు, ప్రజా పోరాటాలలలో తన వంతు పాత్ర పోషించి తనకంటూ పేరు సంపాదించుకొని అనేక ఉద్యమాలలో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి సమ్మయ్య అన్నారు. అదేవిధంగా అమీనాపురం ప్రాంతంలో సిపిఐ ఉద్యమ నిర్మాణంలో ప్రధాన పాత్ర నద్దునూరి సమ్మయ్య ది అని చెప్పక తప్పదని అన్నారు. సమ్మయ్య ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్, సిపిఐ నాయకులు మంద భాస్కర్, కాసు సాయి, గ్రామ పెద్దలు వెల్పుగోండ ఆనంద్, జన్ను కట్టయ్య, దండు కొమురయ్య, దండు సురేందర్, అంబేద్కర్ యువజన సంఘం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్పుగోండ ఏలీయా, కట్కూరి ప్రేమ్ కుమార్, జన్ను శ్రీను, దండు బాబు, జన్ను చంటి, ముల్లి శివ, సమ్మయ్య భార్య నద్దునూరి వెంకటమ్మ, కుమారుడు నద్దునూరి సారంగం, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags: