25న పోలీస్ జాబ్ మేళా
విశ్వంభర, సిద్దిపేట: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర పేరిట ఈనెల 25న మెగా జాబ్ మేళాను పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తామని సీపీ రష్మీ పెరుమాళ్ గురువారంనాడొక ప్రకటనలో తెలిపారు. మేళా ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుందని, టెన్త్, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులని చెప్పారు. ఐటీ, ఫార్మసీ, ఇండస్ట్రీ, వివిధ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తాయని తెలిపారు. ఆసక్తి, రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు విద్యార్హత ధృవపత్రాల జిరాక్స్ కాపీలు, పాస్ ఫొటోలు, కనీసం 5రెజ్యూమ్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. జిల్లాలోని యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని కోరారు. పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, సామాజిక బాధ్యతగా యువతకు ఉపాధి కల్పించే దిశగా 'ఉద్యోగ మిత్ర' కార్యక్రమాన్ని చేపడుతోందని రష్మీ తెలిపారు.



