వైద్య శిబిరాలతో  పేదలకు మేలు : ఎంపీ లక్ష్మణ్

వైద్య శిబిరాలతో  పేదలకు మేలు : ఎంపీ లక్ష్మణ్

విశ్వంభర, ముషీరాబాదు :  ఆరోగ్యం ప్రతి పౌరుడి మౌలిక హక్కు అని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. శనివారం ముషీరాబాదు నియోజకవర్గం బాగ్ లింగంపల్లి లంబాడి తండా బస్తీలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ విధంగా నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఉచిత వైద్య పరీక్షలు, నిపుణుల సలహాలతో వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించవచ్చని చెప్పారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించి, శిబిరాల్లో పాల్గొని పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవి చారి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాతిరి పార్థసారథి, డివిజన్ అధ్యక్షుడు గడ్డం సతీష్, బిజెపి నాయకులు జైపాల్ రెడ్డి, జ్యోతి, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: