పశువులకు టీకాలు వేయించాలి
On
విశ్వంభర, గుండాల : గుండాల మండలంలో పాచిల్లా గ్రామాల్లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ అల్లంశెట్టి మహేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 98 పశువులకు టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రమేష్, మండల పశు వైద్యాధికారి డాక్టర్ యాకుబ్, వి ఏ రాజు గోపాలమిత్రలు గోవింద్, కృష్ణ , నరేష్ శ్రీను, శేఖర్, సోమ శేఖర్, రైతులు పాల్గొన్నారు.



