సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫిర్యాదు 

ఖమ్మంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై చర్యలకు డిమాండ్

సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫిర్యాదు 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌ను కలిసి రేవంత్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.


 

విశ్వంభర, తెలంగాణ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌ను కలిసి రేవంత్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు తలెత్తేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, తక్షణమే సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 
ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం దుర్మార్గమన్నారు. ఖమ్మంలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, చంద్రబాబు అనుచరులు ఏకమై బీఆర్ఎస్‌ను అంతం చేయాలని అనడం, తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయాలని, ఎక్కడికక్కడ ఆ పార్టీ దిమ్మెలను కూల్చివేయాలనే చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More అన్నదాత ఆవేదన. - సోలిపేట ఐకేపీ కేంద్రంలో అక్రమాలు - రైతుల ఖాతాల్లో మాయమవుతున్న సొమ్ము - కలెక్టర్ స్పందించాలని బాధితుల డిమాండ్