మల్లన్న కళ్యాణ మహోత్సవ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీరేశం
విశ్వంభర, రామన్నపేట: మండలంలోని నిదానపల్లి గ్రామంలో వెలిసిన (చిన్న శ్రీశైలం) స్వయంభూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ క్యాంపు కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బేతోజి సత్యనారాయణ శాస్త్రి సిద్ధాంతి, ఉత్సవ కమిటీ చైర్మన్ సల్ల భిక్షం యాదవ్, కమిటీ సభ్యులు కొనతం నాగభూషణం, వల్లమాల మల్లేశం, పోతగోని భాగ్యమ్మ, వర్కాల నరేష్, నారపాక రాజ్ కుమార్, సల్ల నరసింహ, వలిగొండ-రామన్నపేట మార్కెట్ కమిటీ వైస్-చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గుత్తా నర్సింహారెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొండ బుచ్చిబాబు గౌడ్, వర్కాల మొగులయ్య, కొండనడిపి శేఖర్, దయ్యాల బిక్షమయ్య, నారపాక లక్ష్మణ్, బోడిగే రంగయ్య, కొండనడిపి మల్లయ్య, చల్ల శ్రీశైలం, బొడ్డుపల్లి లింగస్వామి, కొండ సాయినాథ్, చల్ల నరసింహ, వెలకుర్తి బ్రహ్మచారి, కడారి మల్లేశం, వర్కల రవి, భాషమల్ల ఆంజనేయులు, సల్ల మల్లేశం, భీమనబోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.



