ఘనంగా రాములోరి కళ్యాణం
విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి తో పాటు వివిధ గ్రామాలు, తండాలలో శ్రీ సీతా రామచంద్రుల కళ్యాణం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చిన్ననాగారంలో గ్రామపంచాయతీ పాలకమండలి, నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య నేతృత్వంలో వేద బ్రాహ్మణులు చంద్రశేఖర్,పోలోజు సోమ సత్యనారాయణ చారి మంత్రోచ్ఛరణల మధ్య రాములోరి పరిణయం కన్నుల పండువలా ఘనంగా నిర్వహించారు.పులిహోర, మహాన్నప్రసాద వితరణ చేశారు.ఉపసర్పంచి తుమ్మనపల్లి సతీష్, నాయకులు బైరు అశోక్ గౌడ్,వార్డు సభ్యులు బైరు వెంకటేశ్వర్లు,నిడిగంటి చంద్రమౌళి,బైరు వినయ్ గౌడ్,ముత్యాల సోమక్క వెంకన్న,మునిగంటి సరిత రాజు,చెడుపాక అలివేలు వెంకన్న,గుండాల మంగమ్మ ధర్మయ్య,చెడుపాక సురేష్,వివిధ పార్టీల నాయకులు భక్తులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.ఇనుగుర్తిలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాములోరి కళ్యాణం, మహాన్న ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాలలో సర్పంచులు నిర్వాహక కమిటీల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం వైభోగంగా జరుపుకున్నారు.



