ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తాం: మంత్రి జూపల్లి 

ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తాం: మంత్రి జూపల్లి 

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని అన్నారు.

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని అన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదన్నారు. అసలు పరిశీలనే జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో ఇవాళ (మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగే.. దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల మాటలు ఉన్నాయని మంత్రి మండిపడ్డారు. 

గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని జూపల్లి ఫైర్ అయ్యారు. రైతు భరోసాకు సంబంధించి రూ.6వేల కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వంలో జరిగాయని తెలిపారు. ఒక్క ఈ నెలలోనే రూ.370 కోట్ల చెల్లింపులు చేశామని మంత్రి పేర్కొన్నారు. మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టమనీ.. ప్రజలకు కాదన్నారు. బ్లాకులో అమ్మిన ఘటనలపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసిందన్నారు. అయితే, గత ప్రభుత్వం టానిక్‌లకు ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేశామని మంత్రి వెల్లడించారు. 

Read More 26 న మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు

అదేవిధంగా తయారీ యూనిట్ల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసులు నిత్యం పరిశీలిస్తున్నారని మంత్రి వివరించారు. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప ఉద్యోగుల బదిలీలు జరిగేవి కావనీ.. ఇప్పుడు అలాంటివేవీ లేకుండానే పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని అన్నారు. తప్పుడు రాతలు రాసిన పత్రికపై పరువునష్టం దావా వేస్తామని మంత్రి జూపల్లి హెచ్చరించారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా