బీఆర్ఎస్ నేత హత్య.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సవాల్!
వనపర్తిలో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హత్య వెనక కాంగ్రెస్ నేతలు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది మమ్మాటికి రాజకీయ హత్య అని కేటీఆర్ మండిపడ్డారు. ఆయనతో పాటు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ హత్య వెనుక ఉన్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అంతేకాదు.. జూపల్లిని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలను జూపల్లి ఖండించారు.
హత్య ఘటనలో తన హస్తం ఉందని కేటీఆర్ ఎలా మాట్లాడం సమంజసం లేదని అన్నారు. అసలు శ్రీధర్ రెడ్డికి, రాజకీయాలకు సంబంధమే లేదని తేల్చి చెప్పారు. శ్రీధర్ రెడ్డి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని.. ఆయన వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. దీంతో.. ఆయన శత్రువుల ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చని మంత్రి జూపల్లి అనుమానించారు. అంతేకాదు..
మాజీ ఎమ్మెల్యేతో శ్రీధర్ రెడ్డికి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. శ్రీధర్ రెడ్డి హత్యపై లోతైన దర్యాప్తు చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు తనపై కక్ష కట్టారని ఆరోపించారు. గతంలో జరిగిన ఓ హత్యను కూడా తనకు లింక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ హత్య కూడా భూ వివాదం వల్లే జరిగిందని క్లారిటీ ఇచ్చారు. గండ్రపల్లి, లక్ష్మీపల్లిలో రెండు హత్యలపై ప్రజలకు వాస్తవాలు తెలుసని అన్నారు. తప్పుడు ప్రచారాలతో తనను ఎవరూ దెబ్బకొట్టలేరని చెప్పారు. ఇంకో సారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.