వైదేహినగర్ పార్క్ లో మెగా రక్తదాన శిబిరం
On
విశ్వంభర, వనస్థలిపురం :- మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటి అధ్యక్షులు చేపూరి శంకర్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం వైదేహినగర్ పార్క్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని 61 సార్లు రక్తదానం చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ రామ సుబ్బారెడ్డి, చేపూరి శంకర్, ఆలకుంట. రాము ప్రారంభించారు. రక్తదానం చెసిన యువకులను చేపూరి శంకర్ అభినందించి... వారికీ ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రక్తదానం ప్రాణదానంతో సమానమని... ఇతర దానాల కంటే రక్త దానం గొప్పదని అన్నారు. రక్తదాతలే నిజమైన హీరోలు అని అన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 9 మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని అన్నారు. తలసేమియా బాధితుల కోసం రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి... రక్తం సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నామని అన్నారు.. దేశంలో రోజుకు 12 వేల మంది తలసేమియా బాధితులు మరణిస్తున్నారని..వారి ప్రాణాలు కాపాడడానికి యువత ముందుకు వచ్చి రక్త దానం చేయాలనీ కోరారు.ఐఐఎఫ్ఎల్ మేనేజర్ ప్రశాంత్ ఎస్ సి ఆర్ పి ఎస్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ గంగం శివశంకర్, అంబేద్కర్ సేన నేషనల్ ప్రెసిడెంట్ మన్నే శ్రీధర్ చేపూరి సునీత ఉమా,రాణీ, ముద్దంభాగ్యమ్మ గంజి వెంకటేష్ బాల్రాజ్ అశోక్ సందీప్ రెడీక్రాస్ సిబ్బంది బ్లడ్ డోనర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



