అచ్చంపేటలో ఘనంగా సామూహిక వివాహాలు
On
విశ్వంభర, అచ్చంపేట :- అప్పా శివ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు ఘనంగా నిర్వహించారు. ఈ సామూహిక వివాహాలలో 65 జంటలు పెళ్లి పందిట్లో చూడ ముచ్చటగా అందరిని కనువిందు చేశారు. బీకే ప్యాలస్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం లో అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ , అచ్చంపేట ముఖ్య అతిథులు హాజరయ్యారు. వదు,వరుల తల్లి, తండ్రులు కురుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



