మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం దిల్వర్ గూడా గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని సర్పంచ్ ఎస్,మంజులచత్రు నాయక్ తో కలిసి మాజీ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన బండ బుచ్చయ్య, నెర్రె శ్రీశైలం, నర్రె నర్సింహా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామపంచాయతీ ఆవరణలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోశమని, గ్రామపంచాయతీ పక్కనే గ్రంథాలయం ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు పుట్టినరోజు,పెళ్లిరోజుల సందర్భంగా ఒకటి, రెండు పుస్తకాలు గ్రంథాలయానికి డొనేట్ చేయడం అలవర్చుకోవాలని అన్నారు. ఇటీవల చనిపోయిన మాజీ సర్పంచ్ చెంద్రశేకర్ రెడ్డి సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు , తదితరులు పాల్గొన్నారు.



