చేనేత కళకు ఢిల్లీలో గౌరవం
On
- చేనేత ప్రదర్శనలో పాల్గొన్న జాతీయ అవార్డు గ్రహీత ఆనంద నాగరాజు
విశ్వంభర, హైదరాబాద్ : ఢిల్లీలో జరిగిన 'టీఈహెచ్ బజార్' ఎగ్జిబిషన్ లో ఆనంద నాగరాజు తెలంగాణ చేనేత కళా వైభవం చాటిచెప్పారు. పుట్టపాక గ్రామానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత ఆనంద నాగరాజు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రసిద్ధ తేలియా రుమాల్ తో పాటు సింగిల్, డబుల్ ఇక్కత్ వస్త్రాలను ఆయన ప్రదర్శించారు. మన సంప్రదాయ కళకు ఢిల్లీ వేదికగా దక్కిన ఈ గౌరవంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్రాలకు మంచి ఆదరణ ఉందని , ప్రతిఒక్కరు చేనేత వస్త్రాలను ధరించి చేనేత కళాకారులకు చేయూతను అందించాలని ఆయన కోరారు.



