ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని ఓటర్లకు మాధవీలత హెచ్చరిక.. కేసునమోదు 

ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని ఓటర్లకు మాధవీలత హెచ్చరిక.. కేసునమోదు 

బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ వేళ వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళీని పరిశీలించిన మాధవీలత హల్ చల్ చేశారు.

విశ్వంభర, హైదరాబాద్: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ వేళ వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళీని పరిశీలించిన మాధవీలత హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. పలువురి ఓటర్ల ముఖాలను స్వయంగా ఆమె తనిఖీ చేశారు. ఓటరు కార్డులను పరిశీలించారు. పాతబస్తీలో దొంగ ఓట్లు వేస్తున్నారని, చనిపోయిన వారి పేర్లపై కూడా ఓట్లు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అజంపుర, గోషామహల్‌ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే ఆమె తీరుపై పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో అభ్యర్థికి ఏం పనంటూ ప్రశ్నించారు. 


కాగా, మాధవీలత చేసిన హంగామాపై  హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రోనాల్డ్ రాస్ సీరియస్ అయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో మహిళల బురఖా తొలగించి పరిశీలించిన మాధవీలతపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని కానీ పొలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించి బురఖాలు తొలగించి చూడటం, ఓటరు కార్డులు పరిశీలించడం ఎన్నికల నిబంధనలకు విరుద్దమన్నారు. ఆమెపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Read More ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు....

 

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా