నూనెగూడెంలో లూజ్ విద్యుత్ లైన్లు వెంటనే సరిచేయాలి
- సీపీఎం డిమాండ్
విశ్వంభర, గుండాల: గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ లైన్లను వెంటనే సరిచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామ ప్రజలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దెపురం రాజు మాట్లాడుతూ, ఐదు నెలల క్రితమే గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి విద్యుత్ శాఖ ఏఈ, ఏడీఈల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని విమర్శించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధను ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో చూపడం లేదని మండిపడ్డారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు లూజ్‌గా వేలాడుతూ ఉండటంతో ఈదురు గాలులు, వర్షాల సమయంలో మరింత కిందకు వంగి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీంతో ప్రజలు, పశువులు, వాహనదారులకు ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, లూజ్‌గా ఉన్న విద్యుత్ లైన్లను మరమ్మతు చేసి ప్రమాదాలను నివారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మలిపెద్ది రాజశేఖరరెడ్డి, సత్తిరెడ్డి, రజిత, లక్ష్మి, నేవూరి మల్లారెడ్డి, బత్తిని నాగరాజు, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.