డాక్టర్ తెల్లం వెంకటరావును ఘనంగా సన్మానించిన లయన్ గాదె మాధవరెడ్డి
On
విశ్వంభర, భద్రాచలం : భద్రాచలంలో విశేష కార్యక్రమం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ వైద్య సేవలందించిన 550 మంది డాక్టర్లను సుమన్ టీవీ ఎంపిక చేయగా, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు కూడా వారిలో ఒకరిగా ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ సంఘ సేవకుడు, పట్టణ ప్రముఖుడు లయన్ గాదె మాధవరెడ్డి డాక్టర్ తెల్లాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గాదె మాధవరెడ్డి మాట్లాడుతూ –డాక్టర్ తెల్లం వెంకటరావు వైద్యునిగా ఎంతోమందిని ఆరోగ్యవంతులుగా మార్చిన సేవలు కొనితీరనివి. అలాగే ప్రజా జీవితం లో ప్రభుత్వ పథకాలను పేదల వరకూ చేర్చడంలో నిబద్ధతతో పనిచేసిన నాయకులు. ఆయన్ని ఈరోజు మనం సత్కరించుకోవడం నియోజకవర్గ ప్రజల పక్షాన జరిగిన ఘన కార్యంగా భావిస్తున్నాను," అని పేర్కొన్నారు. సన్మానం సందర్భంగా స్పందించిన డాక్టర్ తెల్లం వెంకటరావు మాట్లాడుతూ –గాదె మాధవరెడ్డి పట్టణం మరియు దూర ప్రాంతాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. వారు నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు," అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్ల పిఎసిఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్, భీమవరపు వెంకటరెడ్డి, దుమ్ముగూడెం మాజీ జడ్పిటిసిసి సభ్యులు సత్యాలు, న్యాయవాది పడిసిరి శ్రీనివాస్, బంబోతుల రాజీవ్, చింతాడి రామకృష్ణ, మామిడి పుల్లారావు, పుల్లగిరి నాగేంద్ర, చిన్న బాబు దొర తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల ఉత్సాహం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



