హక్కుల సాధన కై ఏకమవుదాం భావితరాలకు బాటలు వేద్దాం
షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం
మండల రెవెన్యూ కార్యాలయంలోని డిప్యూటీ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
షాద్ నగర్ ముదిరాజ్ సంఘము ఆధ్వర్యము వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది
విశ్వంభర న్యూస్ :-షాద్ నగర్ తెలంగాణ రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల ముందు ముదిరాజ్ లకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముదిరాజ్ లను బిసి-డి నుండి బీసీ-ఏ కు మార్పు ను వెంటనే వెంటనే చేపట్టాలని , G.o. Ms. No. 15 (తేది :19/2/2009) ను వెంటనే అమలు చేయాలి. కోరుతూ షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది అలాగే మండల రెవెన్యూ కార్యాలయంలోని డిప్యూటీ తహసిల్దార్ కు షాద్ నగర్ ముదిరాజ్ కుల సంఘం తరఫున వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీలలో భాగంగా మాకు ఇచ్చిన న్యాయమైన కోరికలను మాత్రమే మేము అడుగుతున్నాం దీనికి సీఎం రేవంత్ రెడ్డి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరడం జరుగుతుందని అన్నారు
ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలి.చెరువులు/కుంటలపై ముదిరాజు మరియు బెస్తలకులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ చట్టం చేయాలి. మత్స్యకారుల అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా 75% సబ్సిడీతో రుణాలు మంజూరు చేయుటకు 1000 కోట్లు కేటాయించాలని కోరుతూ.ఈనెల 15వ తేదీ సోమవారం నుండి 20వ శనివారం తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ముదిరాజ్ బిడ్డ పెద్ద ఎత్తున కదిలి ప్రతి మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని
రాష్ట్రంలోని ముదిరాజ్ యువత బాధ్యతా యుతంగా పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క చిరకాల వాంఛ అయినటువంటి BC -D నుండి BC -A కు సాధన కోసం ముదిరాజ్ లందరు కృషి చేయాలని కోరుతున్నామని అన్నారు