తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటిఆర్ అజ్ఞాని : మెట్టు సాయి కుమార్
- తెలంగాణ లో కేటిఆర్ శకుని పాత్ర పోషిస్తుండు
- రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు
- రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ గురించి పది నిమిషాలు ఆలోచిస్తే ..
- ఆ పార్టీలో నలుగురు తప్ప ఎవరూ మిగలరు ?
- తెలంగాణను పది సంవత్సరాల పాటు కొరివిదెయ్యంలాగా పీల్చుకొని తిన్నది మీరు కాదా?
విశ్వంభర,హైదరాబాద్ : రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ గురించి పది నిమిషాలు ఆలోచిస్తే ఆ పార్టీలో నలుగురు తప్ప ఎవరూ మిగలరని, ఫిషేర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు.గాంధీ భవన్ ఆయన మీడియతో మాట్లాడుతూ, మేము ఇంకా ఏమి అనుకోలేదు, మేము అనుకుంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటదన్నారు.డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా అన్న ఛాలెంజ్ కి భయపడ్డ కేటిఆర్ కు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు.కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని హెచ్చరించారు. తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటిఆర్ ఓ అజ్ఞాని అని తెలిపారు. తెలంగాణలో కేటీఆర్ శకుని పాత్ర పోషిస్తున్నారని మెట్టు సాయి కుమార్ విమర్శించారు .తెలంగాణ సమాజాన్ని పది సంవత్సరాలు కొరివిదయ్యం లాగ పీల్చుకొని తిన్నది మీరు, కాంగ్రెస్ పార్టీ ని దయ్యం అనడం విడ్డురంగా ఉందన్నారు.మీ సోదరి కవిత దయ్యం అనే పదం నీ గురించా,నీ బావ గురించా మీకే తెలియాలన్నారు. రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు మీరు,మీ పార్టీ అదో పాతాళానికి వెళ్లిపోయారన్నారు.మీ తండ్రి చేసిన అరాచకాలు ఇంకా తెలంగాణ ప్రజలు మర్చి పోలేదన్నారు. కేసీఆర్ యువజన కాంగ్రెస్ నాయకుడిగా గతంలో పనిచేశారని.. ఈ విషయం కేటీఆర్ తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ అధో పాతాళానికి పోయిందని విమర్శించారు. దివంగత నేత వైఎస్సార్‌ని ఆదర్శంగా తీసుకొని రేవంత్‌రెడ్డి స్వర్ణయుగం లాగా తెలంగాణను పాలిస్తున్నారని ఈ సందర్భముగా మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు.